హీరాగోల్డ్‌ వ్యవహారంలో రూ.33 కోట్ల ఆస్తుల జప్తు

అధిక వడ్డీ ఆశచూపి రూ.వేల కోట్లు వసూలు చేసిన హీరాగోల్డ్‌ వ్యవహారంలో ఆ సంస్థతోపాటు ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన రూ.33.06 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం జప్తు చేసింది.

Updated : 26 Mar 2023 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: అధిక వడ్డీ ఆశచూపి రూ.వేల కోట్లు వసూలు చేసిన హీరాగోల్డ్‌ వ్యవహారంలో ఆ సంస్థతోపాటు ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన రూ.33.06 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం జప్తు చేసింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని 24 ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. తమసంస్థలో డిపాజిట్‌ చేసిన సొమ్ముకు అసాధారణ రీతిలో 36 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపడంతో అనేకమంది రూ.వేల కోట్లను డిపాజిట్‌ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే రూ.367 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఏ బిల్డర్స్‌, బెంగళూరులోని నీలాంచల్‌ టెక్నోక్రాట్‌్్స సంస్థల్లోకి హీరాగోల్డ్‌ సొమ్ము మళ్లించినట్లు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకొంది. తాజాగా జప్తుచేసిన రూ.33.06 కోట్లతో కలిపి ఇప్పటివరకు రూ.400.06 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్లయింది. మనీ లాండరింగ్‌ కేసులో నౌహీరా షేక్‌ అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైంది. ఈ కేసులో హైదరాబాద్‌ పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని