హోటల్‌ గదిలో యువనటి ఆత్మహత్య

ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే (25) ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని ఓ హోటల్‌ గదిలో ఆదివారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 27 Mar 2023 03:06 IST

వారణాసి: ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే (25) ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని ఓ హోటల్‌ గదిలో ఆదివారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సారనాథ్‌ ప్రాంతంలో ఆమె బస చేసిన హోటలుకు చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి కొన్నిగంటల ముందు.. శనివారం రాత్రి భోజ్‌పురి సూపర్‌స్టార్‌ పవన్‌సింగ్‌తో కలిసి చేసిన ‘‘యే ఆరా కభీ నహీ హరా’’ అనే పాటతో ఓ మ్యూజిక్‌ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో విడుదల చేశారు. ప్రస్తుతం ‘నాయక్‌’ అనే సినిమా షూటింగులో భాగంగా ఆకాంక్ష వారణాసికి వచ్చారు. ఇటీవలే వాలంటైన్స్‌ డే సందర్భంగా తన ప్రియుడి గురించి కూడా ఓ కీలక ప్రకటన చేశారామె. సహ నటుడు సమర్‌సింగ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు  తెలిపారు. అతడితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఎప్పుడూ చలాకీగా ఉండే ఆకాంక్ష అకస్మాత్తుగా ఇలా ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహీకి చెందిన ఆకాంక్ష 17 ఏళ్ల వయసులో ‘మేరీ జంగ్‌ మేరా ఫైస్లా’ అనే చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. నిత్యం అభిమానులతో విశేషాలు పంచుకొనే ఆకాంక్షకు ఇన్‌స్టాలో 17 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు