కక్షతోనే అచ్చెన్న హత్య
వైయస్‌ఆర్ జిల్లా కడప బహుళార్థ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అచ్చెన్న హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే అదృశ్యం
హింసిస్తూ ప్రాణాలు తీశారు
వైయస్‌ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్‌టుడే, కడప నేరవార్తలు: వైయస్‌ఆర్ జిల్లా కడప బహుళార్థ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్(డీడీ) అచ్చెన్న హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పశు వైద్యశాలలో పనిచేసే ఏడీ సుభాష్‌చంద్రబోస్ డీడీ హత్యకు పథక రచన చేశారని వైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. సుభాష్ చంద్రబోస్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసి జీతాలు రాకుండా చేశారని డీడీ అచ్చెన్నపై కక్ష పెంచుకుని హత్యకు ప్రణాళిక రచించారని వివరించారు. కడపలో సోమవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ‘ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించాం. కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నాం. అచ్చెన్న కుటుంబసభ్యులు ఈ నెల 14న కడప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసి గాలించినా డీడీ ఆచూకీ లభించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది’ అని వివరించారు.
పథక రచన ఇలా..
‘ఈ నెల 11న వైయస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్ల లాడ్జిలో సుభాష్ చంద్రబోస్ (43), అతడి బావమరిది కలసపాడుకు చెందిన చెన్నకృష్ణ (44), అన్నమయ్య జిల్లా గుర్రంకొండ వాసి బాలాజీ నాయక్.. ముగ్గురూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం కడప సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు ముగించుకుని బయటకొచ్చిన అచ్చెన్నను ముగ్గురూ కలిసి కారులో కిడ్నాప్ చేశారు. వాహనంలో మద్యం తాగిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి వరకు తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు గువ్వలచెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అతిగా మద్యం తాగడంవల్ల అపస్మారకస్థితిలో ఉన్న డీడీని ఘాట్‌రోడ్డు గోడపై కొట్టి లోయలోకి తోసి చంపారు. డీడీ సెల్‌ఫోన్‌ను సీకే దిన్నె పరిధిలోని కొండలో పడేశారు’ అని ఎస్పీ వెల్లడించారు. ‘అచ్చెన్న కనిపించడంలేదంటూ ఆయన కుమారుడు క్లింటన్ చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కార్యాలయంలో పనిచేసే ఏడీలను అనుమానితులుగా పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అచ్చెన్నను చంపినట్లు అంగీకరించారు’ అని వివరించారు.
వెలుగులోకి వచ్చిన లేఖ
తనకు ప్రాణహాని ఉన్నట్లు ప్రభుత్వానికి డీడీ అచ్చెన్న రాసిన లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది. డీడీ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలను వివరిస్తూ.. లేఖలో ఓ వైపు గమనిక.. అంటూ మొదలు పెట్టి... నాకు కడపలో హాని జరిగి ప్రాణాలు పోతే దానికి ఇద్దరు ఉన్నతాధికారులే బాధ్యులంటూ పశుసంవర్ధకశాఖ సంచాలకుడు, వైఎస్‌ఆర్ జిల్లా జేడీ పేరును పేర్కొన్నారు. కార్యాలయ వ్యవహారాలపై లోకాయుక్తకు ఆయన ఫిర్యాదు చేస్తూ ఈ నెల 12న 16 పేజీల లేఖను పోస్టు చేసిన రెండు గంటల్లోనే అదృశ్యమయ్యారు. ఆ మేరకు ఆధారాలు బయటపడ్డాయి.
పోలీసుల నిర్లక్ష్యమే కారణం: మంద కృష్ణ
పోలీసుల నిర్లక్ష్యమే అచ్చెన్న హత్యకు కారణం. కేసు నమోదైన తరువాత సరిగా దర్యాప్తు చేయని ఒకటో పట్టణ ఠాణా సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలి. అచ్చెన్న కుమారుడు తనతో మాట్లాడినప్పుడు ఒకటో పట్టణ ఠాణా సీఐ ఫిర్యాదులో ఫలానా పేరు తొలగించాలని ఒత్తిడి తీసుకొచ్చారని, పేరు తొలగించకుంటే కేసు నమోదు చేయనని చెప్పారని తెలిపారు. ఇది దారుణం. బాధితులిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారిపై కేసు నమోదు చేయాలి. దర్యాప్తు ప్రారంభం కాకమునుపే సీఐ కుట్రతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. అచ్చెన్న మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యుల డిమాండ్
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెదేపా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు.. మాజీ మంత్రి ఎరిక్షన్ బాబు, కొండేపి ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు కర్నూలులోని అచ్చెన్న స్వగృహానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అచ్చెన్న మృతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Mekapati Chandrashekhar Reddy: టికెట్ కోసం జగన్‌ను ఐదుసార్లు కలిసినా ప్రయోజనం లేదు: ఎమ్మెల్యే మేకపాటి
-
Movies News
Chiranjeevi: వరుణ్ - లావణ్య.. అద్భుతమైన జోడీ: చిరంజీవి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nara Lokesh: వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్ సెల్ఫీ
-
Politics News
Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్