అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు.

Published : 29 Mar 2023 04:23 IST

పోలీసుల అదుపులో అనుమానితులు

తణుకు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. విగ్రహం తలను తొలగించారు. తల భాగం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు దళిత సంఘాల నేతలు, అంబేడ్కర్‌వాదులు మంగళవారం గ్రామానికి చేరుకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇది కేవలం అంబేడ్కర్‌ విగ్రహంపై జరిగిన దాడి కాదని, దళితులపై దాడి అని విమర్శించారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ తెలిపారు.
బీ అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని తెదేపా మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ ధ్వజమెత్తారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు