పొలం తగాదాలో పెదనాన్న హత్య
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్‌లో భూ తగాదాలు భగ్గుమన్నాయి.
తల, మొండెం వేరుచేసి గ్రామంలో హల్‌చల్
వీడియో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్
న్యూస్‌టుడే, ఝరాసంగం, జహీరాబాద్ అర్బన్: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దీపూర్‌లో భూ తగాదాలు భగ్గుమన్నాయి. పొలం పంపకం విషయంలో స్థానికుడైన బండమీది చంద్రయ్య(60) దారుణ హత్యకు గురయ్యారు. జహీరాబాద్ గ్రామీణ సీఐ వెంకటేశ్, గ్రామస్థులు తెలిపిన ప్రకారం... బర్దీపూర్‌కు చెందిన చంద్రయ్య, రత్నం అన్నదమ్ములు. మూడెకరాల పొలం పంపకం విషయంలో కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం చంద్రయ్య పొలానికి వెళ్లినట్లు తెలుసుకున్న రత్నం కుమారుడు రాకేశ్ అటవీ ప్రాంతంలో మాటువేశాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యను అడ్డగించి వెంట తెచ్చుకున్న తల్వార్‌తో మెడపై వేటు వేసి తల, మొండెం వేరు చేశాడు. అనంతరం చంద్రయ్య తలతో ఊరి మధ్యలో ఉన్న బసవేశ్వర విగ్రహం వద్దకు వచ్చిన రాకేశ్.. ‘నన్ను, నా కుటుంబాన్ని మా పెదనాన్న ఏళ్లుగా వేధిస్తున్నాడు. న్యాయంగా దక్కాల్సిన భూమి పంచకుండా రాజకీయం చేస్తున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధులూ ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ని చంపేశా’ అని వీడియో రికార్డు చేయించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అక్కణ్నుంచి ఆటోలో ఝరాసంగం వైపు వెళ్లి తలను రోడ్డు పక్కన పారేశాడు. హత్య ఘటనలో రాకేశ్ ఒక్కడే పాల్గొన్నాడా, ఇంకెవరైనా సహకరించారా, వీడియో తీసిందెవరు, ప్రయాణించిన ఆటో ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంద్రయ్యకు భార్య పూలమ్మ, కుమారుడు ప్రశాంత్, ముగ్గురు కూతుళ్లున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు జహీరాబాద్ గ్రామీణ ఠాణాలో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
బెంగాల్లో పెళ్లింట మహావిషాదం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్