అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో నిందితుల అరెస్ట్‌

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం ఉన్నత పాఠశాల ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Updated : 30 Mar 2023 05:02 IST

తణుకు, అత్తిలి, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం ఉన్నత పాఠశాల ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తణుకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ వివరాలను ఎస్పీ రవిప్రకాశ్‌ విలేకర్లకు వెల్లడించారు. ముద్దాపురం గ్రామానికి చెందిన గుమ్మిడి మోహన్‌ ఇద్దరు బాలురతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు చెప్పారు. విగ్రహం తలభాగాన్ని గ్రామ సమీపంలోని చెరువులో పడేసినట్లు తెలుసుకుని, దానిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో అంబేడ్కర్‌ ఫ్లెక్సీని చించివేస్తే గ్రామ పెద్దలు మందలించినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లెం ఆనంద్‌ ప్రకాశ్‌ సందర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని