ఆలయంలో కూలిన మెట్లబావి పైకప్పు

మధ్యప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకొంది. ఇందౌర్‌లోని బేలేశ్వర్‌ మహదేవ్‌ ఝూలేలాల్‌ ఆలయంలో గురువారం 50 అడుగుల మెట్లబావి పైకప్పు కూలి అందులో 30 మందికి పైగా భక్తులు పడిపోయారు.

Published : 31 Mar 2023 04:05 IST

ఇందౌర్‌లో 14 మంది మృతి

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకొంది. ఇందౌర్‌లోని బేలేశ్వర్‌ మహదేవ్‌ ఝూలేలాల్‌ ఆలయంలో గురువారం 50 అడుగుల మెట్లబావి పైకప్పు కూలి అందులో 30 మందికి పైగా భక్తులు పడిపోయారు. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పటేల్‌ నగర్‌ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో రద్దీ పెరిగింది. స్థలాభావం కారణంగా వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి కప్పుపై కూర్చున్నారు. దీంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయి ఘోరం జరిగింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనలు, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని