విచారణ పేరుతో పోలీసుల దౌర్జన్యం

విచారణ పేరుతో సామాన్య వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి తీవ్రంగా కొట్టిన ఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని సిద్దవరంలో చోటుచేసుకుంది.

Published : 31 Mar 2023 05:04 IST

కొనకనమిట్ల, న్యూస్‌టుడే: విచారణ పేరుతో సామాన్య వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి తీవ్రంగా కొట్టిన ఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని సిద్దవరంలో చోటుచేసుకుంది. సిద్దవరం గ్రామానికి చెందిన తనను బుధవారం సాయంత్రం విచారించాలని కొనకనమిట్ల పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు నరసింహరావు తెలిపారు. మూగ జీవాలను దొంగతనం చేసి ఎక్కడ అమ్ముతున్నావో చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. తాను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తానని చెప్పారు. తాను పది రోజుల క్రితం రెండు గేదెలను వినుకొండలో దింపి రావాలని తన అన్న శ్రీనివాసులు చెప్పడంతో వదిలి వచ్చానని తెలిపారు. అయితే పశువులను మీ అన్న దొంగతనం చేసినట్లు చెప్పాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చి కొట్టి రాత్రి 11 గంటలకు ఇంటి వద్ద వదిలి వెళ్లారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు తనను పొదిలి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని తెలిపారు. అన్యాయంగా తనను కొట్టిన పోలీసులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నరసింహరావు డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని చరవాణిలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని