ఎమ్మెల్యే శ్రీదేవిపై అసభ్య పోస్టింగులు పెట్టిన వారిపై ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేశారనే ఆరోపణతో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె కుమార్తెలపై అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైకాపాకు చెందిన మంగళగిరి నియోజకవర్గ దళిత నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 31 Mar 2023 05:04 IST

మంగళగిరి, విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేశారనే ఆరోపణతో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె కుమార్తెలపై అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైకాపాకు చెందిన మంగళగిరి నియోజకవర్గ దళిత నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను, ఆమె కుమార్తెలను దుర్భాషలాడుతూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. అనేక రకాలుగా అవమానిస్తూ ప్రచారం చేస్తున్న మధురెడ్డి, నాగార్జున, బోరుగడ్డ అనీల్‌, అనితారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా జిల్లా అధికార ప్రతినిధి పచ్చల శ్యామ్‌బాబు, జిల్లా కార్యదర్శి ఈపూరి ఆదాం, మల్లవరపు సుధారాణి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

* ఉండవల్లి శ్రీదేవి, ఆమె కుమార్తెలపై విజయవాడ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు