విశ్రాంత ఐఏఎస్‌ అధికారికి జైలుశిక్ష

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మిజోరం కేడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి కవాడి నరసింహకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ హైదరాబాద్‌ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.

Published : 01 Apr 2023 04:16 IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మిజోరం కేడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి కవాడి నరసింహకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ హైదరాబాద్‌ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. 1991 నుంచి 2006 వరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ నరసింహపై 2006లో సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తిచేసి, 2010లో అభియోగ పత్రం దాఖలు చేయగా, నేరం రుజువు కావడంతో నరసింహకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని