గోవా హోటల్‌లో నెదర్లాండ్స్‌ మహిళపై కత్తితో దాడి

భారత్‌ పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్‌ మహిళపై గోవాలో దాడి జరిగింది. బాధితురాలు బస చేసిన హోటల్‌లో పనిచేస్తున్న నిందితుడు ఆమెను కత్తితో పొడిచాడు.

Published : 01 Apr 2023 11:52 IST

పణజీ: భారత్‌ పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్‌ మహిళపై గోవాలో దాడి జరిగింది. బాధితురాలు బస చేసిన హోటల్‌లో పనిచేస్తున్న నిందితుడు ఆమెను కత్తితో పొడిచాడు. ఆమెను కాపాడటానికి యత్నించిన వ్యక్తినీ గాయపర్చాడు. ఉత్తర గోవాలోని పెర్నెమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు బుధవారం అర్ధరాత్రి హోటల్‌ ఆవరణలో టెంట్‌లో నిద్రిస్తుండగా నిందితుడు అభిషేక్‌ వర్మ అందులోకి చొరబడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అతడు బాధితురాలి గొంతును గట్టిగా నొక్కి బెదిరించాడు. ఈక్రమంలో కేకలు విన్న స్థానికుడు ఒకరు అక్కడికి రావడంతో నిందితుడు పారిపోయాడు. కాసేపటికి అతడు కత్తితో తిరిగి వచ్చి బాధితురాలిని, ఆమెను కాపాడిన వ్యక్తిని పొడిచి గాయపర్చాడు. అనంతరం అక్కణ్నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడి అభిషేక్‌ కోసం గాలింపు మొదలు పెట్టిన పోలీసులు శుక్రవారం అతణ్ని అరెస్టు చేశారు. అతడిది ఉత్తరాఖండ్‌ అని పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు