గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
స్నేహితులతో సరదాగా ఆడిపాడి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నాన్నమ్మ చెంత చేరి.. కథ చెప్పమంటూ.. రాత్రి నిద్రపోయిన బాలిక గుండెపోటుతో శాశ్వతంగా దూరమైంది.
మరిపెడ, న్యూస్‌టుడే: స్నేహితులతో సరదాగా ఆడిపాడి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నాన్నమ్మ చెంత చేరి.. కథ చెప్పమంటూ.. రాత్రి నిద్రపోయిన బాలిక గుండెపోటుతో శాశ్వతంగా దూరమైంది. ఈ హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అబ్బాయిపాలెం శివారు బోడతండాకు చెందిన బోడ లక్పతి, వసంత దంపతుల కుమార్తె స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తండాలోని తోటి మిత్రులతో ఆడుకుంది. ఎప్పటిలాగే రాత్రి నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఆయాసపడుతూ తనకేదో అవుతోందని చెప్పి నాన్నమ్మను నిద్ర లేపింది. మాట్లాడలేక ఆయాసపడుతూ లేచి కూర్చొని ఒక్కసారిగా మంచంపైనే ఒరిగిపోయింది. తల్లిదండ్రులు బిడ్డను తీసుకొని దగ్గరలో ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు పరుగు తీశారు. అప్పటికే బాలిక గుండె ఆగిందని తెలుసుకొని విలపించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
26/11 Attack: భారత్‌కు అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేసిన 26/11 దాడుల నిందితుడు తహవూర్ రాణా
-
Movies News
Project K: ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ రికార్డులు ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్ చేస్తుంది: రానా
-
World News
భయానకం.. 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు..!
-
General News
Tamilisai: తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు: గవర్నర్ తమిళిసై
-
General News
Employee: ఆఫీసులో రోజుకి 6 గంటలు టాయిలెట్లోనే.. చివరకు ఇదీ జరిగింది!
-
India News
Wrestlers Protest: కోరిక తీరిస్తే.. ఖర్చు భరిస్తానన్నాడు: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్లో కీలక ఆరోపణలు