తేనెటీగల దాడితో పరుగెత్తి.. బావిలో పడి మృతి చెందిన రైతు

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామంలో తేనెటీగలు దాడి చేయడంతో భయంతో పరుగెత్తి బావిలో పడి ఓ రైతు మృతిచెందారు.

Updated : 01 Apr 2023 05:16 IST

కొత్తగూడ, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామంలో తేనెటీగలు దాడి చేయడంతో భయంతో పరుగెత్తి బావిలో పడి ఓ రైతు మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు కొన్‌రెడ్డి సంజీవరెడ్డి (59), జనార్దన్‌ రెడ్డి శుక్రవారం నీలంపల్లిలోని తమ పొలం వద్దకు వెళ్లారు. పొలం పనులు చేస్తుండగా పక్కనే చెట్టుపై ఉన్న తేనెతుట్టె నుంచి ఒక్కసారిగా తేనెటీగలు లేచి దాడి చేయడంతో.. వారు పరుగెడుతూ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకారు. అన్న సంజీవరెడ్డికి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందగా, తమ్ముడు జనార్దన్‌ రెడ్డి ఈదుకుని ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు సమాచారమివ్వడంతో కొత్తగూడ ఎస్సై నగేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని