బాలిక అదృశ్యం కేసులో వాలంటీర్‌ అరెస్టు

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలో ఓ బాలిక అదృశ్యమైన కేసులో నిందితుడు చంద్రశేఖర్‌ను నాయుడుపేట డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Updated : 02 Apr 2023 05:44 IST

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలో ఓ బాలిక అదృశ్యమైన కేసులో నిందితుడు చంద్రశేఖర్‌ను నాయుడుపేట డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జనవరిలో బాలిక అదృశ్యం కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీకాళహస్తి మండలం రామాపురం సచివాలయం పరిధిలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నారు. నిందితుడికి కోర్టు రిమాండ్‌ విధించడంతో నెల్లూరు ఉపకారాగారానికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు