బాలుడి తలలో దిగిన ఇనుపచువ్వ

డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో బాలుడి తలలోకి ప్రమాదవశాత్తు ఇనుప చువ్వ దూసుకెళ్లింది.

Updated : 02 Apr 2023 10:41 IST

మలికిపురం, న్యూస్‌టుడే: డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో బాలుడి తలలోకి ప్రమాదవశాత్తు ఇనుప చువ్వ దూసుకెళ్లింది. సఖినేటిపల్లి మండలం రామేశ్వరానికి చెందిన అన్నంనీడి శ్రీనివాసరావు, సత్యవాణిల కుమారుడు పూర్ణచంద్ర విశ్వేశ్వరాయపురంలో తాతయ్య ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి వద్దే ఉన్న పూర్ణచంద్ర.. పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి అక్కడ కుప్పగా పోసిన చువ్వలపై పడిపోయాడు. అందులోని 6 ఎంఎం ఊచ పూర్ణచంద్ర ఎడమ కణత భాగం నుంచి గుచ్చుకుంది. స్థానికులు బాలుడిని వెంటనే లక్కవరం పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి ఎం.దుర్గాప్రసాద్‌ ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు