Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్‌కౌంటర్
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబీకుల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. ముజఫర్‌నగర్‌లోని షాపుర్‌లో శనివారం జరిగింది.
ముజఫర్‌నగర్: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబీకుల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. ముజఫర్‌నగర్‌లోని షాపుర్‌లో శనివారం జరిగింది. 2020 ఆగస్టు 19న పఠాన్‌కోట్‌లోని క్రికెటర్ సురేశ్ రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ చోరీకి పాల్పడ్డాడు. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేశ్ రైనా మామ అశోక్ కుమార్, అత్త ఆశా, బావమరిది కౌశల్ కుమార్‌లను రషీద్ తీవ్రంగా గాయపరిచాడు. అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆశా, కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ కేసులో ఇద్దరు నిందితులను గతేడాది సెప్టెంబరులో పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా రషీద్ పేరు బయటకొచ్చింది. అప్పటికే రషీద్ పరారీలో ఉన్నాడు. ‘శనివారం కొందరు నేరస్థులు షాపుర్‌కు వచ్చినట్లు ఇన్‌ఫార్మర్ నుంచి మాకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఎస్‌వోజీ బృందం అప్రమత్తమైంది. సోరం-గోయ్లా రహదారిపై దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా నిందితుడు రషీద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే షాపుర్‌లోని సీహెచ్‌సీకి తరలించాం. అప్పటికే నిందితుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు’’ అని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్ అక్కడ - లావణ్య ఇక్కడ.. పెళ్లి వార్తలు నిజమేనా?
-
Politics News
TDP: ‘బాబాయిని చంపిందెవరు’.. యువగళం పాదయాత్రలో పోస్టర్లతో ప్రదర్శన
-
Sports News
AUS vs IND WTC Final: జూలు విదల్చాలి.. గద పట్టాలి!
-
Crime News
Hyderabad: ‘25న నా పెళ్లి.. జైలుకెళ్లను’.. కోర్టులో రిమాండ్ ఖైదీ వీరంగం
-
World News
India- Nepal: హిట్ నుంచి సూపర్ హిట్‌కు..! నేపాల్‌తో సంబంధాలపై ప్రధాని మోదీ
-
General News
Polavaram project: 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యం