గగనతలంలో ఎయిర్‌హోస్టెస్‌తో వృద్ధుడి అసభ్య ప్రవర్తన

గగన యానాల్లో ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న కొందరు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనల పరంపరలో మరో తాజా ఘటన ఇది.

Updated : 02 Apr 2023 05:31 IST

గగన యానాల్లో ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న కొందరు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనల పరంపరలో మరో తాజా ఘటన ఇది. బ్యాంకాక్‌ నుంచి ముంబయికి వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయి ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిన ఆహారం అందుబాటులో లేదని చెప్పగా.. అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చికెన్‌ డిష్‌ తీసుకోడానికి అంగీకరించాడు. చెల్లింపుల నిమిత్తం పీవోఎస్‌ మెషిన్‌ తీసుకురాగా.. కార్డు స్వైపింగు వంకతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఎయిర్‌హోస్టెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆ వ్యక్తి సీటు నుంచి లేచి మరీ అందరి ముందు వేధించాడు. అక్కడితో ఆగకుండా ఇతర సిబ్బందిని, తోటి ప్రయాణికులను సైతం ఇబ్బంది పెట్టాడు. విమానం ముంబయికి చేరుకోగానే.. అప్పటికే సమాచారం అందిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి.. స్వీడన్‌కు చెందిన 62 ఏళ్ల క్లాస్‌ ఎరిక్‌ హరాల్డ్‌ జొనాస్‌ వెస్ట్‌బర్గ్‌ అని పోలీసులు తెలిపారు. తర్వాత అతణ్ని కోర్టు ముందు హాజరుపరచగా.. బెయిలు మంజూరైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు