మండుటెండలో 7 కి.మీ. నడక.. ప్రాణాలు కోల్పోయిన నిండు గర్భిణి

తొమ్మిది నెలల నిండు గర్భిణి ఆసుపత్రికి వెళ్లి రావడానికి మండుటెండలో 7 కి.మీ. నడవడంతో వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయింది.

Updated : 16 May 2023 06:02 IST

పాల్ఘర్‌: తొమ్మిది నెలల నిండు గర్భిణి ఆసుపత్రికి వెళ్లి రావడానికి మండుటెండలో 7 కి.మీ. నడవడంతో వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఓసర్‌ వీరా గిరిజన గ్రామానికి చెందిన సోనాలి వాఘట్‌(29) అనే గర్భిణి ఆరోగ్య పరీక్షల కోసం తవాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి(పీహెచ్‌సీ), అక్కడ్నుంచి తిరిగి ఇంటికి 7 కి.మీ. నడిచింది. వడదెబ్బ తగిలి సోనాలి సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైంది. అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని