అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కానిస్టేబుల్‌ కాల్పులు

మధ్యప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి తండ్రీకుమార్తెలపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Updated : 23 May 2023 06:16 IST

తండ్రి మృతి, కుమార్తెకు గాయాలు
రైలు కింద పడి నిందితుడి ఆత్మహత్య!

షాజాపుర్‌: మధ్యప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఒకరు అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి తండ్రీకుమార్తెలపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటన అనంతరం నిందితుడు రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. షాజాపుర్‌ జిల్లాలోని మలిఖేడీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ సుభాష్‌(26) ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో జాకిర్‌ షేక్‌(55) అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. జాకిర్‌తోపాటు అతడి కుమార్తె(25)పై నాటు తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. తూటా గాయాలతో జాకిర్‌ మరణించగా, అతడి కుమార్తె చికిత్స పొందుతోంది. సోమవారం ఉదయం సుభాష్‌ మృతదేహం సమీపంలోని రైలుపట్టాలపై కనిపించింది. సుభాష్‌, యువతి మధ్య ప్రేమ వ్యవహారంలో గొడవల వల్లే నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని, ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు