633 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశా నుంచి గంజాయి తీసుకువస్తున్న అంతర్రాష్ట్ర ముఠా నుంచి 633 కేజీల సరకును అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 24 May 2023 04:03 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి గంజాయి తీసుకువస్తున్న అంతర్రాష్ట్ర ముఠా నుంచి 633 కేజీల సరకును అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏఎస్పీ ప్రతాప్‌శివకిషోర్‌ మంగళవారం తెలిపిన ప్రకారం.. గూడెంకొత్తవీధి మండలం మాలిగుడకు చెందిన కొర్రా లైకోన్‌ అలియాస్‌ లక్ష్మణ్‌.. అల్లూరి జిల్లాకు చెందిన గంపరాయి నారాయణ, సాగిన గోపాలకృష్ణ, కొర్రా మోహన్‌రావు, కిలో మధు, ఒడిశా, రాజస్థాన్‌లకు చెందిన మరో ఇద్దరితో ముఠాగా ఏర్పడి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. కళాశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూరగాయలను సరఫరా చేసే నిందితుడు.. వాటి మాటున ఒడిశా నుంచి అల్లూరి మన్యం మీదుగా కాకినాడ జిల్లా తుని వరకు సరకు చేరుస్తుంటాడు. ఆ క్రమంలో సోమవారం ఒడిశా నుంచి 3 కార్లలో గంజాయితో వస్తుండగా సీలేరు పోలీసులు ధారకొండ సమీపంలో తనిఖీ చేసి 633 కేజీల సరకును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు చిక్కగా.. ఏడుగురు పారిపోయారు. రూ.2.55 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని 3 వాహనాలను సీజ్‌ చేసినట్లు ఏఎస్పీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని