9 ఏళ్ల చెల్లిని చంపిన 13 ఏళ్ల బాలిక

బిహార్‌లో ప్రియుడితో కలిసి ఓ 13 ఏళ్ల బాలిక తన తొమ్మిదేళ్ల సోదరిని హత్య చేసింది. వైశాలీ జిల్లాలోని హర్‌ప్రసాద్‌ గ్రామంలో ఈ నెల 15న ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 26 May 2023 04:36 IST

ప్రియుడితో కలసి ఘాతుకం

పట్నా: బిహార్‌లో ప్రియుడితో కలిసి ఓ 13 ఏళ్ల బాలిక తన తొమ్మిదేళ్ల సోదరిని హత్య చేసింది. వైశాలీ జిల్లాలోని హర్‌ప్రసాద్‌ గ్రామంలో ఈ నెల 15న ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు ఓ వివాహ వేడుక కోసం ఇటీవల వేరే ఊరికి వెళ్లారు. నాలుగైదు రోజుల అనంతరం వారు ఇంటికి చేరుకోగా.. చిన్న కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే వారి ఇంటి వెనుక బాలిక మృతదేహం లభ్యమైంది. కాల్‌ రికార్డింగ్‌, ఇతరత్రా సమాచారం ఆధారంగా.. మృతురాలి సోదరిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ నేరాన్ని తామే చేసినట్లు అంగీకరించింది. ‘‘బాలిక, ఆమె ప్రియుడు సన్నిహితంగా ఉండటాన్ని తొమ్మిదేళ్ల సోదరి చూసింది. తమ విషయం తల్లిదండ్రులకు చెబుతుందన్న భయంతో వారు ఆమెను చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే మూడు రోజులపాటు దాచిపెట్టారు. దుర్వాసన వస్తుండటంతో ఇంటి వెనుక ఉన్న పొలంలో పడేశారు. మృతదేహాన్ని గుర్తుపట్టరాకుండా ముఖంపై యాసిడ్‌ పోశారు. వేళ్లు నరికేశారు’’ అని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని