Crime News: వృద్ధుణ్ని చంపి.. దేహాన్ని ముక్కలు చేసి.. యువజంట కిరాతకం
కేరళలోని కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ (58) అనే హోటల్ యజమానిని ఓ యువజంట అత్యంత కిరాతకంగా చంపింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీబ్యాగులో తీసుకువెళ్లి అటవీప్రాంతంలో విసిరేశారు.
ప్యారిస్ (చెన్నై) న్యూస్‌టుడే: కేరళలోని కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ (58) అనే హోటల్ యజమానిని ఓ యువజంట అత్యంత కిరాతకంగా చంపింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీబ్యాగులో తీసుకువెళ్లి అటవీప్రాంతంలో విసిరేశారు. చెన్నైలో అరెస్టయిన నిందితులు ఇద్దరినీ శుక్రవారం ఉదయం కేరళ పోలీసులకు అప్పగించారు. సిద్ధిఖ్ వ్యాపార నిమిత్తం కుటుంబసభ్యులకు దూరంగా కోజికోడ్ జిల్లాలోనే వసతి ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో మే 18న కోజికోడ్‌లోని ఎరంజిపాలెంలో ఉన్న ఓ హోటలులో బి3, బి4 గదులను ఆయన బుక్ చేసుకున్నారు. అదే హోటలులో పాలక్కడ్‌కు చెందిన నిందితులు శిబిల్ (22), ఫర్హానా (18) పై అంతస్తు గదిలో దిగారు. మే 19న శిబిల్, ఫర్హానా ఓ ట్రాలీబ్యాగుతో కిందకు దిగిన దృశ్యాలు హోటలు కెమెరాల్లో రికార్డయ్యాయి.ఆ తర్వాత వీరు ముగ్గురూ అదృశ్యమయ్యారు. సిద్ధిఖ్‌కు అతడి కుమారుడు ఎన్నిసార్లు ఫోను చేసినా స్విచ్‌ఆఫ్ వచ్చింది. అదే సమయంలో అతడి ఫోనుకు తండ్రి కార్డుతో రూ.లక్ష డ్రా చేసినట్లుగా ఏటీఎం నుంచి సందేశాలు వచ్చాయి. అనుమానంతో సిద్ధిఖ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య విషయం బయటపడింది. ప్రధాన నిందితుడైన శిబిల్ గతంలో సిద్ధిఖ్ హోటలులో పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చక పనిలో నుంచి తొలగించారు. హత్య వెనుక హనీట్రాప్ ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?