కొనుగోలు కేంద్రంలో రైతు దుర్మరణం

కొనుగోలు కేంద్రంలో నిద్రపోయిన రైతు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. టార్పాలిన్‌ కప్పుకొని పడుకున్న రైతును గమనించని డ్రైవర్‌ ట్రాక్టరును పైనుంచి తీసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Published : 28 May 2023 04:50 IST

నిద్రిస్తున్న సమయంలో పైనుంచి వెళ్లిన ట్రాక్టర్‌

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: కొనుగోలు కేంద్రంలో నిద్రపోయిన రైతు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. టార్పాలిన్‌ కప్పుకొని పడుకున్న రైతును గమనించని డ్రైవర్‌ ట్రాక్టరును పైనుంచి తీసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలం వచ్చునూర్‌ గ్రామానికి చెందిన ఉప్పులేటి మొండయ్య (58) తాను పండించిన వరి ధాన్యాన్ని 15 రోజుల క్రితం వచ్చునూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ధాన్యం తూకం పూర్తయింది. మొత్తం 200 బస్తాలు కాగా ఓ ట్రాక్టరులో 150 బస్తాలు లోడ్‌ చేశారు. మిగిలిన వాటి కోసం మరో ట్రాక్టర్‌ రావాల్సి ఉంది. దీంతో ఆ బస్తాల పక్కనే టార్పాలిన్‌ కప్పుకొని పడుకున్నారు. 150 బస్తాల లోడ్‌ పూర్తయిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైతు పడుకున్న విషయం గమనించకుండా టార్పాలిన్‌ మీదుగా ట్రాక్టర్‌ తీసుకెళ్లాడు. దీంతో మొండయ్య అక్కడికక్కడే మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని