రూ.2 వేల నోట్లు తరలిస్తున్న మావోయిస్టు కొరియర్ల అరెస్టు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు.
దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని తనిఖీ చేసి.. సుమారు రూ.6 లక్షల నగదు (రూ.2 వేల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు కమాండర్ మల్లేశ్ ఆదేశాల మేరకు దాదాపు రూ.8 లక్షలను పలువురు నమ్మకమైన వ్యక్తుల పేరిట.. వివిధ బ్యాంకుల్లో జమ చేసేందుకు వీరు తెచ్చారని గుర్తించారు. అందులో రూ.1.86 లక్షలను వివిధ బ్యాంకుల్లో జమచేసినట్లు గుర్తించారు. మిగిలిన సొమ్ము, ద్విచక్రవాహనాన్ని, బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకుని ఇద్దరు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ambedkar statue: అగ్రరాజ్యంలో 19 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు