పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికుమారుడు సహా అతడి ఇద్దరి సోదరీమణులు.. అనుమానాస్పద రీతిలో సజీవదహనమయ్యారు.
మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికుమారుడు సహా అతడి ఇద్దరి సోదరీమణులు.. అనుమానాస్పద రీతిలో సజీవదహనమయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌లో ఈ ఘటన జరిగింది. మృతులను మంగళ్ సోరెన్ (33), సుమీ సోరెన్ (35), బహమనీ సోరెన్ (23)గా పోలీసులు గుర్తించారు.
దుర్గాపుర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న హఫ్నా సోరెన్ కుమారుడు మంగళ్ సోరెన్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫు కుటుంబసభ్యులు మంగళ్ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు. సుమీ సోరెన్ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుండగా.. బహమనీ గృహిణి. వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదో పని మీద మార్కెట్‌కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి మంటలు వస్తున్నాయి. వెంటనే తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడున్నారు. హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ