స్నేహితుడి చితిలో దూకి ప్రాణత్యాగం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నగలా ఖంగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాలుతున్న తన స్నేహితుడి చితిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు.

Published : 28 May 2023 07:57 IST

ఫిరోజాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నగలా ఖంగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాలుతున్న తన స్నేహితుడి చితిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు. కేన్సర్‌తో బాధపడుతున్న అశోక్‌ (42) శనివారం ఉదయం మృతిచెందాడు. యమునానది తీరాన జరిగిన అంత్యక్రియల్లో అశోక్‌ మిత్రుడు ఆనంద్‌ (40) కూడా పాల్గొన్నాడు. అశోక్‌ మరణంతో తీవ్రంగా కలతచెందిన ఆనంద్‌ క్రతువులన్నీ ముగిసి ఒకరొకరుగా నిష్క్రమిస్తున్న సమయంలో.. ఉన్నపళంగా మిత్రుడి చితిలోకి దూకాడు. వెనక్కుమళ్లి పరుగున వచ్చిన జనం అతణ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఒళ్లంతా కాలిన ఆనంద్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఆగ్రాకు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో అతడు మృతిచెందాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని