ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు.. ‘సహ’ కార్యకర్త అరెస్టు

ఫేస్‌బుక్‌ వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సమాచార హక్కు (సహ) కార్యకర్తను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 28 May 2023 05:36 IST

ముంబయి: ఫేస్‌బుక్‌ వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సమాచార హక్కు (సహ) కార్యకర్తను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని గులామ్‌ క్వాజీగా గుర్తించారు. భారత శిక్షాస్మృతిలోని 509, 500, 506(2), 504 సెక్షన్ల ప్రకారం అతడిపై కేసు నమోదు చేశారు. దీనిపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఫేస్‌బుక్‌లో క్వాజీ ఓ పోస్టు చేస్తూ.. మోదీ, అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించామని, దీని వెనుకున్న కారణాలపై ఆరా తీస్తున్నామని ముంబయి పోలీసులు తెలిపారు.మోదీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏప్రిల్‌లో ప్రధాని మోదీ కొచ్చిన్‌ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆత్మాహుతి దాడి చేసి మోదీని హతమారుస్తానంటూ ఓ వ్యక్తి రాసిన లేఖ వైరల్‌ అయ్యింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే ప్రధానికి హాని తలపెడతానంటూ ఓ వ్యక్తి మార్చి నెలలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారించిన ధర్మాసనం సంశయ లబ్ధి కింద అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అతడిపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు