గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎంను పగలగొట్టి... రూ.15 లక్షల చోరీ

అనకాపల్లి పట్టణం పూడిమడక రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు గ్యాస్‌ కట్టర్‌తో యంత్రాన్ని పగలగొట్టి డబ్బును తీసుకెళ్లారు.

Updated : 29 May 2023 06:22 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పట్టణం పూడిమడక రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు గ్యాస్‌ కట్టర్‌తో యంత్రాన్ని పగలగొట్టి డబ్బును తీసుకెళ్లారు. ఏటీఎంలో ఈనెల 23న రూ.18 లక్షల నగదును సిబ్బంది ఉంచారు. అందులో రూ.15.17 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్ప్రే చల్లినట్లు గుర్తించారు. ఫుటేజీ ఉందా లేదా అని పోలీసులు పరిశీలిస్తున్నారు. 2018లో ఇదే ఏటీఎంలో కొందరు చోరీకి యత్నించి విఫలమయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని