బాణసంచా పేలుడు.. ఐదుగురికి గాయాలు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరులోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు గాయపడ్డారు.

Updated : 29 May 2023 06:19 IST

అక్రమంగా తయారుచేస్తున్న వైకాపా నాయకుడు

చేజర్ల, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరులోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మాముడూరుకు చెందిన వైకాపా నాయకుడొకరు చౌకతోపు (సర్వి తోట)లో అక్రమంగా బాణసంచా తయారు చేయిస్తున్నారు. శనివారం రాత్రి నిప్పులు లేచి పేలుడు సంభవించింది. ఆ ధాటికి అక్కడ పనిచేస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిలో మణి, శివ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులంతా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చౌకతోపులో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగినట్లు తొలుత పోలీసులకు బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకులు సమాచారమిచ్చారు. అనంతరం జరిగిన పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాణసంచా కేంద్రంలో సామగ్రిని సీజ్‌ చేశారు. ప్రమాదంపై కేసు నమోదైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని