కారు టైరు పేలి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా కుష్ఠగి తాలూకా జాతీయ రహదారి 50పై కలికేరి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 29 May 2023 06:36 IST

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం 

గంగావతి, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా కుష్ఠగి తాలూకా జాతీయ రహదారి 50పై కలికేరి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విజయపురకు చెందిన కుటుంబసభ్యులు ఆరుగురు కారులో బెంగళూరు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న రాచప్ప బనసోడె, రాఘవేంద్ర కాంబళె, అక్షయ శివశరణ, జయశ్రీ కాంబళె, చిన్నారులు రాఖీ, రష్మిక అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు క్రేన్‌ సాయంతో కారును బయటకు లాగి మృతదేహాలను వెలికి తీశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని