Wife - Husband: క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం

క్షణికావేశంలో ఆలుమగలు బలవన్మరణానికి పాల్పడగా.. వారి ఏడు నెలల చిన్నారి అనాథగా మిగిలాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. దేవనకొండ మండలం గుడమిరాలకు చెందిన అడ్డాకుల రంగనాయకులు(28) ఆర్‌ఎంపీ వైద్యుడు.

Updated : 29 May 2023 08:22 IST

అమ్మానాన్నల్ని కోల్పోయిన 7 నెలల చిన్నారి

కర్నూలు నేరవిభాగం, దేవనకొండ న్యూస్‌టుడే: క్షణికావేశంలో ఆలుమగలు బలవన్మరణానికి పాల్పడగా.. వారి ఏడు నెలల చిన్నారి అనాథగా మిగిలాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. దేవనకొండ మండలం గుడమిరాలకు చెందిన అడ్డాకుల రంగనాయకులు(28) ఆర్‌ఎంపీ వైద్యుడు. పత్తికొండ మండలం చిన్నహుల్తికి చెందిన లత(25)తో రెండేళ్ల క్రితం అతనికి వివాహమైంది. వీరికి ఓ కుమారుడు. శనివారం పొలానికి వెళ్లే విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో లత క్రిమిసంహారక మందు తాగారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినా.. పరిస్థితి చేయిదాటిపోయి అర్ధరాత్రి దాటాక ఆమె మృతి చెందారు. భార్య మృతితో మనస్తాపం చెందిన రంగనాయకులు అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం రైల్వే పోలీసులు కర్నూలులోని కోట్ల రైల్వేస్టేషన్‌ పరిధిలో పట్టాలపై అతని మృతదేహాన్ని గుర్తించారు. ఆయన తల, మొండెం వేరుగా పడి ఉండటాన్ని చూసి పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షణికావేశంలో వారి బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని