Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత పాశవికంగా పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది.

Updated : 30 May 2023 07:06 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత పాశవికంగా పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే బాలికను దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు. అంతటితో ఆగని ఆ మానవ మృగం.. పెద్ద బండరాయితో బాలిక తలపై పలుసార్లు మోదాడు. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ.. అక్కడ ఉన్న వారు అడ్డుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. దిల్లీ రోహిణిలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన సాక్షి(16) అనే బాలిక.. సాహిల్‌ అనే 20 ఏళ్ల యువకుడితో స్నేహంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం సాయంత్రం తన స్నేహితురాలి బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా షాపింగ్‌ కోసమని సాక్షి బయలుదేరింది. అదే సమయంలో ఆమె వెంట వెళ్లిన ఆ యువకుడు.. బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు.  బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాహిల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌లో సోమవారం అరెస్టు చేశారు. ఇతను ఫ్రిజ్‌లు, ఏసీలు రిపేరు చేసే వ్యక్తి. ఈ ఘటనను దిల్లీ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని