అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం
అస్సాంలోని గువాహటి జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
అస్సాంలోని గువాహటి జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల నుంచి 10 మంది విద్యార్థులతో కలిసి వెళ్తున్న ఓ స్కార్పియో కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడం వల్ల అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని బలంగా తాకింది. దీంతో కారులో ఉన్న 10 మంది విద్యార్థుల్లో ఏడుగురు అక్కడిక్కక్కడే మరిణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జలుక్‌బరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘటనాస్థలిని పరిశీలించారు.
హై టెన్షన్ విద్యుత్తు వైర్లు తగిలి ఆరుగురు కూలీల దుర్మరణం
ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్తు వైర్లు తగిలి ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో సోమవారం జరిగింది. రాంచీకి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిచిత్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌లో మరమ్మత్తులు చేస్తున్న ఒప్పంద కార్మికులపై విద్యుత్ స్తంభం హైటెన్షన్ ఓవర్ హెడ్ వైర్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి