తేనెటీగల నుంచి తప్పించుకోవాలని.. బావిలో దూకిన యువకుడి మృతి
తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవాలని బావిలో దూకిన ఓ యువకుడు నీటమునిగి మృతి చెందారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సోన్, న్యూస్‌టుడే: తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవాలని బావిలో దూకిన ఓ యువకుడు నీటమునిగి మృతి చెందారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సోన్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శాకెర గ్రామంలో సోమవారం భీమన్న పండుగ నిర్వహించారు. బాజాభజంత్రీలతో గుడిచుట్టూ గ్రామస్థులు ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో అక్కడి మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడిచేశాయి. అక్కడివారంతా తలో దిక్కు పరుగులు తీయగా.. కల్లెడపు నర్సయ్య (27) పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూకారు. అతడికి ఈతరాక పోవడంతో నీటమునిగి మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం