కెనడాలో పట్టపగలే పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ హత్య

పంజాబ్‌ మూలాలున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ కెనడాలో పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. అతడు పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 30 May 2023 05:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ మూలాలున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ కెనడాలో పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. అతడు పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలో టాప్‌-10 గ్యాంగ్‌స్టర్లలో అమర్‌ప్రీత్‌ సమ్రా అలియాస్‌ చిక్కీ ఒకడు. అతడి వర్గానికి ‘బ్రదర్స్‌ గ్రూప్‌’ ముఠాతో వ్యాపార వ్యవహారాల్లో వైరం ఉంది. అమర్‌ప్రీత్‌ తాజాగా వాంకోవర్‌ నగరంలో ఓ వివాహ వేడుకకు తన సోదరుడు రవీందర్‌తో కలిసి హాజరయ్యాడు. అక్కడ వేదికపై కొద్దిసేపు నృత్యం చేశాడు. అంతలోనే కొందరు సాయుధులు వచ్చి సంగీతం ఆపాలని ఆదేశించారు. వెంటనే కాల్పులు జరిపి అమర్‌ప్రీత్‌ను హతమార్చారు. కెనడాలో ముఠాలను ఏర్పాటుచేసి హింసకు పాల్పడుతున్న 11 మంది పేర్లను గతేడాది అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జాబితాలో అమర్‌ప్రీత్‌, రవీందర్‌ కూడా ఉన్నారు. వారికి పలు హత్యలు, కాల్పుల ఘటనలతో సంబంధాలు ఉన్నట్లు బ్రిటిష్‌ కొలంబియా పోలీసులు తెలిపారు. అమర్‌ప్రీత్‌ యూఎన్‌ గ్యాంగ్‌లో పనిచేసేవాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని