Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే మద్యం మత్తులో కర్కశంగా చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన ఉదంతమిది.
మంగళగిరి, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే మద్యం మత్తులో కర్కశంగా చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన ఉదంతమిది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. నవులూరు ఎంఎస్‌ఎస్ కాలనీకి చెందిన మునగపాటి గోపికి మూడేళ్ల క్రితం మౌనికతో వివాహమైంది. వీరికి రెండేళ్ల క్రితం లక్ష్మీపద్మావతి పుట్టింది. ఆరు నెలల కిందట మరో పాప జన్మించింది. ఇద్దరూ బాలికలే పుట్టారంటూ గోపి తరచూ మద్యం తాగి వచ్చి తల్లీకుమార్తెలపై దాడికి పాల్పడేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న లక్ష్మీపద్మావతిని చేయి పట్టుకుని ఈడ్చి నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను తల్లి స్థానికుల సహకారంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి దగ్గర మద్యం మత్తులో వీరంగం వేస్తున్న గోపిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Bhuvaneshwari: అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి
-
World Cup-Dhoni: అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్.. ధోనీ మళ్లీ పాత లుక్‌లో!
-
Elon Musk: ఎక్స్‌లో వీడియో గేమ్ స్ట్రీమింగ్.. కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన మస్క్
-
Assam: బాల్య వివాహాలు.. అస్సాంలో మరోసారి అరెస్టులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Nobel Prize: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్