TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస పరిధిలోని రంగాపురానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరెళ్ల రామాంజనేయులు(51) రాజమహేంద్రవరంలో జరిగిన తెదేపా మహానాడు నుంచి ఆదివారం రాత్రి ఇంటికి వెళ్తూ కొత్తపేట సమీప మందపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Updated : 30 May 2023 07:16 IST

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస పరిధిలోని రంగాపురానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరెళ్ల రామాంజనేయులు(51) రాజమహేంద్రవరంలో జరిగిన తెదేపా మహానాడు నుంచి ఆదివారం రాత్రి ఇంటికి వెళ్తూ కొత్తపేట సమీప మందపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రామాంజనేయులుకు భార్య అంబామణి, కుమారుడు సందీప్‌, కుమార్తె ఫాల్గుణి ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా రామాంజనేయులు సేవలందించారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం రామాంజనేయులు కుటుంబసభ్యులను ఓదార్చారు. పార్టీ తరఫున రూ.10లక్షల ఆర్థిక సాయం అందించేందుకు అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్ణయించారని చినరాజప్ప తెలిపారు. విజయవాడలో 1996లో జరిగిన తెదేపా సింహగర్జన సభకు హైదరాబాద్‌ నుంచి వస్తూ.. రామాంజనేయులు అన్న కరెళ్ల సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి దంపతులు రోడ్డుప్రమాదంలోనే మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని