Kodada: డాక్టర్ రాలేదని కాన్పు చేసిన నర్సులు.. వికటించి శిశువు మృతి
డాక్టర్ ఆస్పత్రికి రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించడంతో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

కోదాడ రూరల్: డాక్టర్ ఆస్పత్రికి రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించడంతో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన మానసకు కాన్పుకోసం ఆస్పత్రిలో చేర్చారు.
మంగళవారం తెల్లవారుజామున మానసకు నొప్పులు రావడంతో అక్కడి సిబ్బంది వైద్యురాలికి సమాచారం అందించారు. ఆమె రాలేనని చెప్పడంతో నర్సులే నిర్లక్ష్యంగా కాన్పు చేశారు. శిశువుకు ప్రమాదంగా ఉందని.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు. ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం.. అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రైవేట్ ఆస్పత్రికి రానని చెప్పడంతో శిశువు మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
IND vs AUS: ఆసీస్‌పై భారత్ విజయం.. మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యం
-
Mainampally: భారాసకు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్