కొనుగోళ్లలో జాప్యం... కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న జాప్యాన్ని తట్టుకోలేక యువ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 01 Jun 2023 04:05 IST

గుండాల, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న జాప్యాన్ని తట్టుకోలేక యువ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు, గ్రామస్థులు తెలిపిన ప్రకారం... స్థానికుడైన కౌలు రైతు అన్నెపర్తి ప్రవీణ్‌ గ్రామంలో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి వేశారు. ప్యాక్స్‌ ఆధ్వర్యంలో గుండాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి 300 బస్తాల ధాన్యాన్ని నెల క్రితం తరలించారు. అకాల వర్షాలతో ఇప్పటికే పలుమార్లు తడిసి మొలక రావడం, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం కావడం, అయిదు రోజులకు ఒక్కసారైనా లారీలు రావడం లేదని తహసీల్‌ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పెట్రోలు పోసుకున్న రైతును రెవెన్యూ సిబ్బంది గమనించి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. తహసీల్దార్‌ జి.జ్యోతిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా... రైతు మద్యం మత్తులో ఇలా ప్రవర్తించారని, ధాన్యం కొనుగోలు, రవాణా విషయాల్లో ఎలాంటి జాప్యం లేదని, తడిసిన ధాన్యాన్ని సైతం కొంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని