తిరుమల ఘాట్‌ రోడ్డులో రెండు ప్రమాదాలు

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం రెండు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన 12 మంది భక్తులు ఓ అద్దె వాహనంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు.

Published : 01 Jun 2023 05:02 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో బుధవారం రెండు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన 12 మంది భక్తులు ఓ అద్దె వాహనంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. తిరిగి మొదటి ఘాట్‌ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా మాల్వాడిగుండం సమీపంలోని మలుపు వద్ద వారి వాహనం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొంది. భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మరో ప్రమాదంలో రాత్రి ఓ జీపు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొంది. భక్తులెవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న ఘాట్‌ రోడ్డు భద్రతా సిబ్బంది వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని