తుపాకీతో బెదిరించి రూ.50 లక్షల దోపిడీ

రెండు ద్విచక్రవాహనాలతో నలుగురు దుండగులు జాతీయ రహదారిపై వెళుతున్న కారును అడ్డగించి డ్రైవర్‌, యజమానిని తుపాకీతో బెదిరించి రూ.50 లక్షలు దోచుకున్న సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Published : 01 Jun 2023 05:02 IST

జాతీయ రహదారిపై దుండగుల అఘాయిత్యం

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: రెండు ద్విచక్రవాహనాలతో నలుగురు దుండగులు జాతీయ రహదారిపై వెళుతున్న కారును అడ్డగించి డ్రైవర్‌, యజమానిని తుపాకీతో బెదిరించి రూ.50 లక్షలు దోచుకున్న సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సినీఫక్కీలో జరిగిన దోపిడీ వివరాలను ఎస్‌ఐ నరేష్‌, బాధితులు వివరించారు. ఒడిశా రాష్ట్రం పర్లాఖెముండికి చెందిన పప్పుదినుసుల వ్యాపారి కోట్ల వంశీకృష్ణ కారులో డ్రైవర్‌ జయరాంతో కలిసి మంగళవారం విశాఖకు వెళ్లారు. అక్కడ వ్యాపారి వరదరాజును కలిసి లావాదేవీల అనంతరం రూ.55 లక్షలు తీసుకొని అదే రోజు రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి స్వస్థలానికి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. రూ.50 లక్షలు కారు వెనుక సీటులో, రూ.5 లక్షలు ముందు సీటులో కూర్చున్నచోట పెట్టుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాతవలస టోల్‌గేట్ వద్ద టీ తాగి తిరిగి బయలుదేరారు. జాతీయ రహదారిపై చోడమ్మ అగ్రహారం సమీపంలో హెల్మెట్లు పెట్టుకున్న నలుగురు ద్విచక్రవాహనదారులు కారును అడ్డగించి తుపాకీతో బెదిరించి డోర్లు తెరిపించారు. ఇద్దరి కళ్లలో కారం చల్లి కారు వెనుక సీటులో ఉన్న రూ.50 లక్షలతో ఉడాయించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు