పురిటి బిడ్డను గోనెసంచిలో పెట్టి..

అప్పుడే పుట్టిన మగ బిడ్డను గోనెసంచిలో పెట్టి తహసీల్దారు కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు వద్ద వదిలి వెళ్లింది ఓ అభాగ్యురాలు.

Published : 01 Jun 2023 05:02 IST

తహసీల్దారు కార్యాలయ ఆవరణలో వదిలి వెళ్లిన మహిళ

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: అప్పుడే పుట్టిన మగ బిడ్డను గోనెసంచిలో పెట్టి తహసీల్దారు కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు వద్ద వదిలి వెళ్లింది ఓ అభాగ్యురాలు. ఈ సంఘటన బుధవారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది. గోనె సంచిని పందులు లాక్కొని వెళుతుండగా పిల్లాడు ఏడవడంతో తహసీల్దారు కార్యాలయం సిబ్బంది విన్నారు. వెంటనే వీఆర్వోలు రంగయ్య, వెంకటరామయ్య, అక్బర్‌అలి... గోనె సంచి వద్దకు వెళ్లి పరిశీలించి, శిశువును గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఆర్‌ఎంవో  రమణారెడ్డి, చిన్నపిల్లల వైద్యురాలు ప్రియదర్శిని ప్రథమ చికిత్స అందించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్‌ఎంవో తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని