బాణసంచా పేలి ముగ్గురి దుర్మరణం

బాణసంచా పేలుడు ముగ్గురిని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం కువ్వాకుళ్లిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

Published : 01 Jun 2023 05:02 IST

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: బాణసంచా పేలుడు ముగ్గురిని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం కువ్వాకుళ్లిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గ్రామ శివారులో వీరరాఘవులు అనే వ్యక్తి బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మార్చితోనే లైసెన్సు గడువు ముగిసినప్పటికీ అనధికారికంగా టపాసుల్ని తయారు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం భారీ శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. భయభ్రాంతులకు గురైన స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా గ్రామానికి చెందిన సాథు నాగేంద్ర(31) మృతదేహం ఛిద్రమై కనిపించింది. దట్టమైన పొగ వ్యాపించడంతో గది లోపల ఎంతమంది మృతి చెందారో తొలుత గుర్తించలేకపోయారు. సత్యవేడు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.  తర్వాత ఎల్లకట్టవకు చెందిన శంకరయ్య(50), గూడూరుకు చెందిన ఏడుకొండలు(45) మృతదేహాల్ని గుర్తించారు. తయారీ కేంద్రం ఆవరణలో ఉన్న వీరరాఘవులతో పాటు కల్యాణ్‌కుమార్‌ అనే మరోవ్యక్తీ పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని