కాకినాడ జీజీహెచ్‌ ఐసీయూలో అగ్నిప్రమాదం

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్‌)లోని మెడికల్‌ వార్డు ఐసీయూలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పొగలు వ్యాపించి.. రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

Published : 02 Jun 2023 05:06 IST

కాకినాడ (మసీదుసెంటర్‌), న్యూస్‌టుడే: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్‌)లోని మెడికల్‌ వార్డు ఐసీయూలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పొగలు వ్యాపించి.. రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏసీ గది కావడంతో పొగ బయటకు వెళ్లే మార్గం లేక చీకట్లు అలముకున్నాయి. కిటికీల అద్దాలను పగలగొట్టిన సిబ్బంది.. పొగను బయటకు పంపే ప్రయత్నం చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న 11 మంది రోగులను బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు