Kurnool: జగన్‌ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి

పత్తికొండలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా పోలీసులు ఓ యువకుడిని చేతులతో నెట్టేసి, మోకాళ్లతో తన్నిన ఘటన చోటుచేసుకుంది. సభలో అతడు తాను నిల్చున్న ప్రదేశం నుంచి ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించాడు.

Updated : 02 Jun 2023 07:28 IST

పత్తికొండలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తుండగా పోలీసులు ఓ యువకుడిని చేతులతో నెట్టేసి, మోకాళ్లతో తన్నిన ఘటన చోటుచేసుకుంది. సభలో అతడు తాను నిల్చున్న ప్రదేశం నుంచి ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించాడు. అక్కడున్న ఓ పోలీసు అధికారి అతన్ని వెనక్కి నెట్టారు. యువకుడు అదేమని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో ఆయనతో పాటు అక్కడున్న పోలీసులు చొక్కా పట్టుకుని.. చెంపపై కొట్టి.. మోకాళ్లతో అతని పొట్టలో తన్నారు. మరో ఇద్దరు పోలీసులు కూడా కాళ్లతో తన్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి షేర్‌ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే బాధితుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పత్తికొండ పోలీసులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు