మరో పరీక్షలోనూ మాస్ కాపీయింగ్‌కు యత్నం
సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. కమిషన్ కార్యాలయం నుంచే కాదు పరీక్ష కేంద్రం నుంచి కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు వెల్లడి కావడంతో నివ్వెరపోతున్న సిట్ అధికారులు... ఇంకా ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయన్న దానిపై దృష్టి సారించారు.
సాంకేతిక కారణాలతో విఫలమైన డీఈఈ రమేశ్!
మలుపులు తిరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసు
ఈనాడు, హైదరాబాద్: సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. కమిషన్ కార్యాలయం నుంచే కాదు పరీక్ష కేంద్రం నుంచి కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు వెల్లడి కావడంతో నివ్వెరపోతున్న సిట్ అధికారులు... ఇంకా ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయన్న దానిపై దృష్టి సారించారు. అభ్యర్థులు ఎవరెవరెక్కడ కూర్చుంటారనే వివరాలు కూడా బయటకు పొక్కడంతో మొత్తం పరీక్షల నిర్వహణ వ్యవస్థపైనే అనుమానాలు ముప్పిరిగొంటున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా విద్యుత్తుశాఖ డీఈఈ పూల రమేశ్ ముఠా జనవరి, ఫిబ్రవరిలలో జరిగిన ఏఈఈ, డీఏవో పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ చేయించిన వ్యవహారం బయటపడడంతో ఈ ముఠా పూర్వాపరాలపై సిట్ మరింత లోతుగా విచారిస్తుంటే కొత్త విషయాలు తెరపైకొస్తున్నాయి. డీఈఈ రమేశ్ జనవరిలో జరిగిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ సూపర్‌వైజర్ పరీక్ష సమయంలోనూ మాస్‌కాపీయింగ్ చేయించేందుకు ప్రయత్నించినట్లు, సాంకేతిక కారణాల వల్ల అది విఫలమైనట్లు తెలిసింది.
సమాధానాలు వెతికేందుకు ఒక్కొక్కరికి రూ.10,000
ఇప్పటివరకూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పనిచేసే ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల ద్వారా ప్రశ్నపత్రం పొందిన వారి జాబితా బయటపడగా ఇప్పుడు రమేశ్ వంతు వచ్చింది. ఇతనికి సహకరించిన వారు, ఇతని ద్వారా లబ్ధి పొందిన వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఏఈ ప్రశ్నపత్రాల్లో సమాధానాలు వెతికేందుకు సహకరించిన ఏడుగురికి రమేశ్ ఒక్కొక్కరికి రూ.10,000 ఇచ్చినట్టు తాజాగా వెలుగు చూసింది. ప్రశ్నపత్రాల విక్రయాలలో మరికొందరు దళారులు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇంకా ఎవరెవరు సహకరించారో...
పరీక్షల్లో కాపీయింగ్‌ను నివారించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానమైంది జంబ్లింగ్. ఈ విధానంలో ప్రశ్నపత్రంలో ప్రశ్నలు అవే ఉన్నా వాటి క్రమ సంఖ్య వేర్వేరుగా ఉంటుంది. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు వరసగా ఒకదాని తర్వాత ఒకటి నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలు ఇస్తూ వెళతారు. అంటే మొదట కూర్చున్న అభ్యర్థికి మొదటి సెట్‌లోది, తర్వాత కూర్చున్న వారికి రెండో సెట్లోది... ఇలా నాలుగు సెట్లు ఇచ్చిన తర్వాత అయిదో అభ్యర్థి నుంచి మళ్లీ మొదటి సెట్ నుంచి మొదలుపెడతారు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి పరీక్షకు గైర్హాజరైతే అతనికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం తమవద్దే ఉంచుకుంటారు తప్ప తర్వాతి అభ్యర్థికి ఇవ్వరు. ఇక పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు ఎక్కడ కూర్చోవాలనేది కమిషన్ కార్యాలయంలోనే కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేసి పంపుతారు. మాస్‌కాపీయింగ్‌కు తోడ్పడ్డ రమేశ్ ఈ జంబ్లింగ్ విధానాన్ని పసిగట్టాడు. టోలిచౌకీ ప్రాంతంలో ఉండే అలీ అనే ఓ ప్రిన్సిపల్ ద్వారా ప్రశ్నపత్రాలు సేకరించాడు. అభ్యర్థులు ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఏ బెంచీపై కూర్చున్న అభ్యర్థికి ఏ సెట్ ప్రశ్నపత్రం వచ్చిందన్న వివరాలు ఇంకా ఎవరో అందించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారెవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆర్చరీలో మెరిసిన టీమ్.. తొలి స్వర్ణం కైవసం
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు