పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే.. సినీఫక్కీలో ₹50 లక్షల చోరీ!
అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న అత్యాశ ఓ వ్యక్తిని నిండా ముంచింది. రూ. 2,000 నోట్ల రద్దును దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుని మోసానికి పాల్పడ్డారు.
రాజానగరం, న్యూస్‌టుడే: అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న అత్యాశ ఓ వ్యక్తిని నిండా ముంచింది. రూ. 2,000 నోట్ల రద్దును దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుని మోసానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధి కొంతమూరులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను సీఐ కాశీవిశ్వనాథ్ శుక్రవారం తెలియజేశారు. డా..బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన మాజేటి లక్ష్మీనారాయణ కిరాణా వ్యాపారం చేస్తుంటారు. ఓ వ్యక్తి రూ. 50 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే రూ.60 లక్షల విలువైన రూ.2,000 నోట్లు ఇస్తున్నాడంటూ ఓ స్నేహితుడు చెప్పాడు. సెప్టెంబరు వరకు గడువు ఉన్నందున ఈలోపు ఆ నోట్లు మార్చుకోవచ్చని నమ్మబలికాడు. దీంతో లక్ష్మీనారాయణ గురువారం రాత్రి రూ. 50 లక్షల మేరకు రూ. 500 నోట్లు తీసుకుని కొంతమూరు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండగా పోలీస్ సైరన్ వేసుకుంటూ కారులో నలుగురు వ్యక్తులు వచ్చి బాధితుడిని బెదిరించి ఆ నగదు అపహరించుకుపోయారు. ఈ పరిణామానికి బిత్తరపోయిన ఆయన శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణుజలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు