గునపంతో పొడిచి చంపేస్తా

వార్డులో తాను సూచించిన అనధికార భవనాల జోలికి వెళ్తే గునపంతో పొడిచి చంపేస్తానని సచివాలయ పట్టణ ప్రణాళిక కార్యదర్శిని విశాఖలోని వైకాపా మహిళా కార్పొరేటర్‌ బెదిరించారు.

Published : 03 Jun 2023 04:42 IST

వైకాపా మహిళా కార్పొరేటర్‌ బెదిరింపులు

విశాఖపట్నం(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: వార్డులో తాను సూచించిన అనధికార భవనాల జోలికి వెళ్తే గునపంతో పొడిచి చంపేస్తానని సచివాలయ పట్టణ ప్రణాళిక కార్యదర్శిని విశాఖలోని వైకాపా మహిళా కార్పొరేటర్‌ బెదిరించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లో భవన యజమాని జీ ప్లస్‌-2 అనుమతులు తీసుకుని అదనంగా మరో అంతస్తు నిర్మిస్తున్న విషయం సచివాలయ పట్టణ ప్రణాళిక కార్యదర్శికి తెలిసింది. పనులు నిలిపివేయాలని ఆయన చెప్పారు. సదరు భవన యజమానికి మద్దతుగా నిలిచిన వైకాపా కార్పొరేటర్‌ తన కార్యాలయానికి రావాలని కార్యదర్శికి హుకుం జారీచేశారు. అక్కడికి వెళ్లిన కార్యదర్శిపై కార్పొరేటర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవనం విషయంలో చర్యలు తీసుకుంటే సహించేది లేదని మాట వినకపోతే గునపంతో పొడిచేస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్ని కార్యదర్శి కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్‌ ఆదేశాలతో జీవీఎంసీ ప్రణాళిక సిబ్బంది భవనం స్లాబును తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని