దశాబ్ది ఉత్సవాల్లో అపశ్రుతి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తొలిరోజు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

Published : 03 Jun 2023 05:11 IST

విద్యుదాఘాతంతో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి

పెద్దకొత్తపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో తొలిరోజు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవుని తిర్మలాపూర్‌లో శుక్రవారం సాయంత్రం జాతీయ జెండాను అవనతం చేస్తుండగా.. దాని ఇనుప పైపు 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలి ఉండటంతో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(45) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు బొల్లె చిట్టెమ్మ, బిజినేపల్లి చిట్టెమ్మల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని