దిల్లీ తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

తనను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొన్ని రోజులుగా దిల్లీలో ఆందోళన చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువతి బోడపాటి శేజల్‌ శుక్రవారం సాయంత్రం తెలంగాణభవన్‌ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశారు.

Updated : 03 Jun 2023 06:30 IST

కొన్నిరోజులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా పోరాటం

ఈనాడు, దిల్లీ: తనను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొన్ని రోజులుగా దిల్లీలో ఆందోళన చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువతి బోడపాటి శేజల్‌ శుక్రవారం సాయంత్రం తెలంగాణభవన్‌ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భవన్‌కు చేరుకున్న ఆమె నంది విగ్రహం వద్ద పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన భవన్‌ సిబ్బంది, భద్రతా అధికారులు వెంటనే స్థానిక ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన నోట్‌లో ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని